epaper
Monday, November 17, 2025
epaper

సౌదీ ప్రమాదం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సౌదీ అేబియా(Saudi Arabia)లో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరించాలంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం ఆదేశాలు అందుకున్న ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి రంగంలోకి దిగారు. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం, అందులోని మృతుల వివరాలను సేకరించే పనిలో వారు నిమగ్నమయ్యారు. ప్రమాదంలో తెలంగాణకు చెందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వారి వివరాలు ఏవి అనేవి త్వరితగతిన తెలుసుకోవాలని సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సౌదీ అధికారులతో సమన్వయం చేయాలని ఆదేశించారు. సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

కంట్రోల్ రూమ్ నంబర్లు:

తెలంగాణ సచివాలయం:
+91 79979 59754
+91 99129 19545

జెడ్డా – భారత రాయబారి కార్యాలయం:
80024 40003

ప్రమాదంలో 42 మంది మృతి..

సౌదీ(Saudi Arabia)లో జరిగిన బస్సు ప్రమాదంలో 42 మంది సజీవదహనమయ్యారు. బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతుల్లో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నట్లు సమాచారం. మల్లేపల్లి, బజార్‌ఘాట్ ప్రాంతాల నుండి వచ్చిన 16 మంది కూడా మృతుల్లో ఉన్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. మక్కాలో తమ యాత్రను పూర్తి చేసుకుని మదీనాకు బయలుదేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు, భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో ప్రయాణికులు చాలా మంది నిద్రలో ఉండటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం నుంచి ఒకరు మాత్రమే బ్రతికి బయటపడ్డారని సమాచారం.

Read Also: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవ దహనం

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>