epaper
Monday, November 17, 2025
epaper

సౌదీ ఘటనపై కేంద్రం స్పందన ఇదే..

Saudi Bus Crash | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబాలకు కేంద్రం ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తమ తరఫున ప్రయత్నిస్తున్నామని.. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పింది.

జైశంకర్ దిగ్భ్రాంతి

ఈ ప్రమాదం(Saudi Bus Crash)పై విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదీనాలో భారత పౌరులకు జరిగిన ఈ విషాదం చాలా బాధాకరమని తెలిపారు. ప్రభావిత కుటుంబాలకు రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రమాదం జరిగిన వెంటనే సౌదీ సివిల్‌ డిఫెన్స్‌ బృందాలు, అంబులెన్సులు, పోలీసు బలగాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. బస్సు పూర్తిగా కాలిపోయి ఉండటంతో మృతదేహాల గుర్తింపు కష్టంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రులకు మృతదేహాలను తరలించినట్లు సమాచారం. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ చేపట్టే అవకాశముంది.

Read Also: సౌదీ ప్రమాదం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>