epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అబద్ధాలకు రేవంత్​ బ్రాండ్​ అంబాసిడర్ ​: హరీశ్​ రావు

కలం, వెబ్​డెస్క్​: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు (Harish Rao) మండిపడ్డారు. సీఎం రేవంత్​ అబద్ధాలకు బ్రాండ్​ అంబాసిడర్​ అని ధ్వజమెత్తారు. గురువారం ప్రజాభవన్​ వేదికగా సీఎం రేవంత్​ మీడియా సమావేశం నిర్వహించి.. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనేక విమర్శలు సైతం గుప్పించారు. అనంతరం సీఎం రేవంత్ (Revanth Reddy)​ వ్యాఖ్యలపై హరీశ్​ రావు స్పందించారు. సీఎంకు బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్​ కూడా లేదనే విషయం అందరికీ తెలిసిందేన్నారు. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్యుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శించారు. తమను(కేసీఆర్​, హరీశ్​రావు, కేటీఆర్​) అబద్ధాల కోరులని రేవంత్​ అనడంపై మండిపడ్డారు. అబద్దాలకు బ్రాండ్​ అంబాసిడర్​ రేవంతే అని పేర్కొన్నారు. రేవంత్​కు బ్రిజేష్​ ట్రిబ్యునల్​కు, బచావత్​ ట్రిబ్యునల్​కు తేడా తెలియదన్నారు.

జురాల మీద భారం పెడితే ఆగమైతం..

‘కేసీఆర్​ను, నన్ను ఉరితీయాలని సీఎం రేవంత్​ అనాగరికంగా మాట్లాడారు. నల్లమలసాగర్​పై నా ప్రశ్నకు సూటిగా ఎందుకు సమాధానం చెప్పలేదు? బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాటం నిజమైతే కమిటీ ఎందుకు వేశారు?’ అని హరీశ్​ రావు ప్రశ్నించారు. కమిటీ వేయడమంటే ఏపీ నీటి దోపిడీకి తలుపులు తెరవడమేనని వ్యాఖ్యానించారు. ‘ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 69 శాతం దక్కాలని అప్పుడే డిమాండ్​ చేశాం. బ్రిజేష్​ ట్రిబ్యునల్​ తుది తీర్పు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటిని పంచాలని కోరాం. కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్రం హామీ ఇస్తేనే కేసు విత్​ డ్రా చేసుకున్నాం.

తుంగభద్ర ద్వారా శ్రీశైలానికి 450 నుంచి 600 టీఎంసీల వరకు నీళ్లు వస్తాయనే జ్ఞానం కూడా సీఎంకు లేదు. జురాల ప్రాజెక్ట్​ కింద 5.50 లక్షల ఎకరాల్లో క్రాప్​ హాలి డే ఎందుకు ప్రకటించారు? శ్రీశైలం మీద ఆధారపడిన కల్వకుర్తికి లోటు లేకుండా నీరు వస్తోంది. జురాల మీద భారం పెడితే ఎవరికీ నీళ్లు రావు. అంతా ఆగమైపోతారు. 90 టీఎంసీలతో పాలమూరుకు డీపీఆర్​ పంపాం. ఏడు అనుమతులు తెచ్చాం. కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదు. కేసీఆర్​ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే’ అని సీఎం తీరుపై హరీశ్​ రావు (Harish Rao) మండిపడ్డారు.

Read Also: తెలంగాణ నదీ జలాలకు బీఆర్​ఎస్ మరణశాసనం​ : ఉత్తమ్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>