కలం, వెబ్ డెస్క్ : హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సవ్య సాచి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన హాట్ లుక్స్ తో క్యూట్ స్మైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉంది..తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ అండ్ కామెడీ మూవీ “రాజాసాబ్” లో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు మాళవిక మోహనన్ ,రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..
రాజాసాబ్ మూవీ ఈ నెల 9న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది.. తన కెరీర్ కు సంబంధించి నిధి కీలక వ్యాఖ్యలు చేసింది.. తాను కలిసి నటించిన మొదటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అని ఆయనతో నటించిన హరిహర వీరమల్లు సినిమా తన కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ అని తన కెరీర్ కు ఆ సినిమా చాలా ప్లస్ అయిందని నిధి తెలిపింది..సినిమా ఫలితం ఎలా వున్నా కానీ సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కినట్లు తెలిపింది. పవన్ కళ్యాణ్ తో నటించడం వల్ల తనకి మూడు భారీ ఆఫర్స్ వచ్చాయని త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుంది అని నిధి (Nidhhi Agerwal) వెల్లడించింది.
Read Also: కల్కి 2 షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడేనా!
Follow Us On: X(Twitter)


