కలం, వెబ్ డెస్క్ : హీరో నవీన్ పోలిశెట్టి ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అనగనగా ఒకరాజు. కల్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). తాజాగా నవీన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో నవీన్ మాట్లాడుతూ.. ‘నా సినిమాపై మంచి నమ్మకం ఉంది. ఈ సారి ఇంకొంచెం డిఫరెంట్ గా మీ ముందుకు వస్తున్నాను. సంక్రాంతికి అనేది పెద్ద సీజన్. అన్ని సినిమాలకు స్కోప్ ఉంటుంది. మా సినిమా ఎవరికీ పోటీ కాదు. అన్నీ బాగా ఆడాలి’ అంటూ చెప్పారు నవీన్ పోలిశెట్టి .
ఇక పెళ్లి ఎప్పుడు అని అక్కడున్న వారు ప్రశ్నించగా.. ‘ప్రభాస్ అన్నయ్య చేసుకున్న మరుసటి రోజే చేసుకుంటా’ అంటూ నవ్వుతూ స్పందించాడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). ‘సంక్రాంతికి ముందు ప్రభాస్ మూవీకి, ఆ తర్వాత చిరంజీవి సినిమాకు, ఆ తర్వాత నా సినిమాకు వెళ్తా. మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఒక్కరికీ ఇన్ స్పిరేషన్. నాకు ఆయన వల్లే సినిమాల్లో కష్టపడే తత్వం అలవడింది. ఆయన్ను చూస్తే ఎవరికైనా కాన్ఫిడెన్స్ వస్తుంది’ అంటూ తెలిపాడు నవీన్ పోలిశెట్టి.
Read Also: కామన్ సెన్స్ ఉందా.. సెలబ్రిటీలపై రాధా మనోహర్ దాస్ కామెంట్
Follow Us On : WhatsApp


