Mobile Popup Ad
Mobile Popup Ad

మరికాసేపట్లో కేసీఆర్, రేవంత్ స్పీచ్.. ఒకటే ఉత్కంఠ!

కలం, వెబ్ డెస్క్:  సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Revanth – KCR)  ఒకే రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తుండటంతో ఉత్తర తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మేడిగడ్డను కాసేపటి కిందటే సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్.. మరికాసేపట్లో కాటారం మండలం నస్తూరుపల్లెలో జరగబోయే సభలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో, అటు జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ అధినేత సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్.. ఇద్దరూ దాదాపు ఒకే సమయానికి ప్రసంగించబోతుండటంతో.. ఇద్దరూ ఏం మాట్లాడుతారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఏడాది తరువాత కేసీఆర్ బయటకు రాగా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరాన్ని సందర్శించి.. బ్యారేజ్ రిపేర్లపై ఆరా తీశారు.

Read Also: BRSలో చేరిన అనంతరం జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>