కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్ (Husnabad) కేంద్రంగా రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుంచి నెల రోజులపాటు కొనసాగనున్న హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలకు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు పాల్గొననున్నారు.
శుక్రవారం ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా రేణుకా ఎల్లమ్మ (Renuka Yellamma) జమదగ్ని మహర్షిల కల్యాణం ఘనంగా నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం సందర్భంగా అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్స్, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఆలయ ఈవో కిషన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆలయ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఆర్టీసీ బస్సులో హైడ్రామా: లంచం అడిగిన అధికారికి దేహశుద్ధి!
Follow Us On : WhatsApp

