Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ బస్సులో హైడ్రామా: లంచం అడిగిన అధికారికి దేహశుద్ధి!

కలం, మెదక్ బ్యూరో : హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ (Narayankhed) వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాయికోడ్ సమీపంలో బస్సును తనిఖీ చేస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు చెకింగ్ అధికారి గుర్తించారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో జరిమానా విధించడం పరిపాటి. అయితే సదరు టికెట్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ మాత్రం రూట్ మార్చారు. టికెట్ లేని ప్రయాణికుడితో పాటు కండక్టరు వసంత్ పై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే ఇరవై వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. లంచం అడగడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటంతో సహనం కోల్పోయిన వారు సదరు ఇన్‌స్పెక్టరును బస్సులోంచి కిందకు దించి చెప్పులతో దేహశుద్ధి చేశారు. కండక్టర్‌ సైతం ఆ అధికారిని చితకబాదాడు. ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లంచం అడిగిన అధికారికి ప్రయాణికులే బుద్ధి చెప్పడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.

Read Also: 2026 వరల్డ్ కప్‌లో ఇరాన్ ఆడుతుంది: ఫిఫా క్లారిటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>