కలం, వెబ్ డెస్క్: ఇండియా మహిళ పేస్ బౌలర్ రేణుకా సింగ్ (Renuka Singh) స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. టీ20లకు నుంచి ఏడాదిగా దూరం ఉన్న రేణుక.. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రేణుక అదరగొట్టింది. శ్రీలంకకు చుక్కలు చూపించింది. భారత్‌కు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.
రెండు మ్యాచ్‌లు బెంచ్‌లో గడిపిన రేణుకా, తిరిగి అవకాశమొచ్చిన వెంటనే రిథమ్ అందుకుని బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టింది. ప్రపంచకప్ దృష్ట్యా బౌలింగ్ కాంబినేషన్లను పరీక్షిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్‌కు రేణుకా (Renuka Singh) ప్రదర్శన ధైర్యం ఇచ్చింది. “కేరళ నాకు కలిసొచ్చే ప్రాంతం. ఇక్కడ ఆడినప్పుడల్లా మంచి ఫలితాలు వచ్చాయి. మళ్లీ నాలుగు వికెట్లు రావడం ఆనందంగా ఉంది” అని రేణుక తన పర్ఫార్మెన్స్ గురించి చెప్పింది. అలాగే, “మా బౌలింగ్ విభాగం బాగా పనిచేస్తోంది. పేసర్లు–స్పిన్నర్ల కలయిక సెట్ అవుతోంది. రాబోయే ప్రపంచకప్ (World Cup) కోసం సన్నద్ధం అవడం మా లక్ష్యం. మహిళల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాం” అని చెప్పింది.
Read Also: గస్ అట్కిన్సన్‌కు గాయం.. ఇరకాటంలో ఇంగ్లండ్
Follow Us On: Instagram


