కలం, వెబ్ డెస్క్: హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ (Shivaji) కామెంట్స్‌కు పలువురు యాక్టర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఇప్పటికే నాగరాబు రియాక్ట్ అవ్వగా, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) సైతం ఘాటుగా స్పందించారు. ఆడవాళ్ల పట్ల వ్యాఖ్యలు సరికాదని, శివాజీ మాట్లాడింది ముమ్మాటికీ తప్పు అని ఆయన అన్నారు. మహిళల పట్ల శివాజీ వాడే భాష ఏంటి? ఆడవాళ్లంటే ఏమనుకున్నారు? అని మండిపడ్డారు. శివాజీ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, ఏవైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పాల్సిన రీతిలో చెప్పాలని శివాజీకి ప్రకాశ్ రాజ్ చురకలటించారు.
తరతరలుగా మగవాళ్ల నుంచి ఆడవాళ్లకు అన్యాయం ఎదురవుతుందని, శివాజీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన అనసూయను తాను సమర్థిస్తానని అన్నారు. శివాజీ సారీ చెప్పినా వదలరని అన్నారు. ఓ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని, శివాజీ కామెంట్స్ కచ్చితంగా తప్పేనని ప్రకాశ్ రాజ్ (Prakash Raj) హెచ్చరించారు.
Read Also: చైతూ 25వ సినిమా… సితార నాగవంశీ భారీ ప్లాన్!
Follow Us On: Sharechat


