epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అసెంబ్లీ సెక్రటరీగా రెండ్ల తిరుపతి

కలం డెస్క్ :  రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నర్సింహాచార్యులు బదిలీ కానున్నారు. ఆయన స్థానంలో న్యాయశాఖ మాజీ కార్యదర్శి రెండ్ల తిరుపతి నియమితులు కానున్నారు. ప్రస్తుతం తిరుపతి(Rendla Tirupati) వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ శాసనసభ, శాసనమండలికి కలిపి ఒకే కార్యదర్శిగా డాక్టర్ నర్సింహాచార్యులు పనిచేస్తున్నా ఇక నుంచి రెండింటికీ వేర్వేరు కార్యదర్శులు బాధ్యతలు నిర్వహించనున్నారు. రెండింటికీ వేర్వేరు సెక్రటేరియట్‌లు ఉనికిలోకి రానున్నాయి. పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరు సెక్రటేరియట్‌లు, కార్యదర్శులు ఉన్నట్లుగానే రాష్ట్రంలో అసెంబ్లీ, కౌన్సిల్‌ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పనిచేయనున్నాయి.

ఈ మార్పు గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పటికే చర్చించుకున్నట్లు సమాచారం. ఈ మార్పులో భాగంగా సంబంధిత ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి త్వరలో సంతకం చేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇంతకాలం అసెంబ్లీ, కౌన్సిల్ వేర్వేరు భవనాల్లో పనిచేస్తున్నా ఇక నుంచి మాత్రం ఒకే భవనంలో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవలే కౌన్సిల్ షిప్టింగ్, సౌకర్యాల కల్పన తదితరాలను స్వయంగా పరిశీలించారు.

ఎనిమిదేండ్లుగా అసెంబ్లీ కార్యదర్శిగా :

అసెంబ్లీ కార్యదర్శిగా డాక్టర్ నర్సింహాచార్యులు 2017లో నియమితులయ్యారు. ఆ తర్వాత రెండేండ్లకే ఆయన రిటైర్ అయ్యారు. కానీ ఆయనకు ఎక్స్ టెన్షన్ ఇచ్చిన గత ప్రభుత్వం అదే స్థానంలో కొనసాగించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయనకు ఆ బాధ్యతలే కొనసాగాయి. కొత్తగా అసెంబ్లీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్న రెండ్ల తిరుపతి(Rendla Tirupati) రాష్ట్ర న్యాయశాఖకు 2023 నుంచి 2025 వరకు కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు ఆయన జిల్లాల జడ్జిగానూ పనిచేశారు. ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Also: పవన్.. ఇంకా క్షమాపణ చెప్పలేదే: అనిరుధ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>