కరీంనగర్(Karimnagar) జిల్లా రామడుగులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను తప్పుడు హతమార్చాడు. మామిడి రమేశ్ అనే వ్యక్తి మూడేళ్లుగా టిప్పర్లను కొనుగోలు చేసి, వాటిని అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. దాంతో అప్పులు అధికం అయ్యాయి. వాటిని కట్టే పరిస్థితి లేకపోవడంతో నరేష్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నరేష్ ఓ ప్లాన్ వేశాడు. దాని ప్రకారమే మానసిక పరిపక్వత లేని అన్న వెంకటేష్(37) పేరుపై రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్ కట్టించాడు. ఆ తర్వాత అన్నను టిప్పర్‌తో ఢీ కొట్టించి హత్య చేశాడు. అలా వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో(Insurance Money) అప్పులు తీర్చేయొచ్చని భావించాడు నరేష్. ఈ ఘటనపై పోలీసులు తొలుత యాక్సిడెంట్‌గా కేసు నమోదు చేశారు. కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో నరేష్.. అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో ఇన్సూరెన్స్ సంస్థ వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ప్రారంభించిన దర్యాప్తులో విస్తుబోయే విషయాలు వెలుగు చూశాయి.
Karimnagar |పథకం ప్రకారం టిప్పర్ చెడిపోయిందని చెప్పి వెంకటేష్‌ను బయటకు పిలిపించి, వాహనం కింద పడుకోబెట్టి టిప్పర్‌తో తొక్కించి హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. కుట్రలో పాల్గొన్న రాకేష్, డ్రైవర్ ప్రదీప్‌ను నరేష్ డబ్బుతో ప్రలోభపెట్టాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నరేష్, రాకేష్, ప్రదీప్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
Read Also: పవన్.. ఇంకా క్షమాపణ చెప్పలేదే: అనిరుధ్
Follow Us on: Facebook


