ఇటీవల పీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలను అవమానపరిచారంటూ బీజేవైఎం(BJYM) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలోని గాంధీ భవన్(Gandhi Bhavan) దగ్గర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు వద్ద పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Revanth Reddy చేసిన వ్యాఖ్యలు ఏమిటి?
మంగళవారం గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ.. హిందువులకు అనేక మంది దేవుళ్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ‘పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నడు. రెండు పెళ్ళిలు చేసుకునే వాళ్లకు ఒక దేవుడు ఉన్నడు. మాంసం తినేవాళ్లకు, తినని వాళ్లకు వేరే వేరే దేవుళ్లు ఉన్నారు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో విబేధాలు ఉండటం సహజమే అని చెప్పేందుకు ఆయన ఈ కామెంట్లు చేశారు. పార్టీలో ఎన్ని విబేధాలు ఉన్నా.. సీనియర్లు, జూనియర్లు అంతా కలిసి పనిచేసుకోవాలని ఆయన సూచించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరు అయినప్పటికీ బీజేపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా సెంటిమెంట్ రగిల్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చిచ్చు రేపాయి. ముఖ్యమంత్రి చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోలను బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా వీడియోలను పోస్ట్ చేసింది. మరి ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో వేచి చూడాలి.
Read Also: అసెంబ్లీ సెక్రటరీగా రెండ్ల తిరుపతి
Follow Us On: X(Twitter)


