కలం, వెబ్ డెస్క్: గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు (Congress Leaders) మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని, పార్లమెంట్‌లో హడావిడిగా బిల్లులు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే బిల్లులు ఉపసంహరించుకోవాలని, ఇప్పటికే ఉపాధి హామీకి కుంటిసాకులు చెప్తూ నిధుల్లో కోతలు విధిస్తున్నారని పొన్నం మండిపడ్డారు. గాంధీ పేరు మార్చి గాంధీని అవమాన పరుస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పేదల పొట్టలు గొట్టే ప్రయత్నం చేస్తుందని, పథకం పేరులో నుంచి గాంధీ (Mahatma Gandhi)పేరును తొలగించడం దుర్మార్గమని పొన్నం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో సైతం మరింత విస్తరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు.
పార్లమెంట్ వేదికగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై పార్లమెంట్ ఆవరణలో ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉందని, ప్రజలకు గాంధీని దూరం చేసే చర్య కాబట్టి ధర్నా చేపడుతున్నామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read Also: కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ కోవర్టులున్నారు : మైనంపల్లి హనుమంతరావు
Follow Us On: X(Twitter)


