కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి భారతీయ మేనేజ్‌మెంట్ సంస్థ (IIM)ను మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని, అనుమతులు ఇస్తే తక్షణమే తరగతులు ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని సీఎం Revanth Reddy వెల్లడించారు.
తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరిగిన నేపథ్యంలో, అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఈ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో 18కి పైగా కేవీలు, కొన్ని జేఎన్‌వీలు ఉన్నప్పటికీ, జిల్లాల పెరుగుదలతో మరిన్ని అవసరమని సీఎం రేవంత్(Revanth Reddy) వివరించారు. ప్రస్తుతం దేశంలో 20 ఐఐఎంలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో ఒకటి ఉంది. తెలంగాణకు ఐఐఎం మంజూరైతే, యువతకు అధునాతన మేనేజ్‌మెంట్ విద్య అందుబాటులోకి వస్తుంది.
Read Also: IPL 2026 వేలంలో మెరిసిన కామెరూన్.. ఎంత ఖరీదంటే..!
Follow Us On: Instagram


