కలం, వెబ్ డెస్క్: ఓ ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా వాహనం నుంచి దూకి జంప్ అయ్యాడు. చివరకు పోలీసులు సదరు ఖైదీని వెతికిపట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటన చంచల్ గూడ జైలు (Chanchalguda Jail) సమీపంలో సోమవారం చోటు చేసుకున్నది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురిని మరో కేసులో పీటీ వారెంట్‌పై బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు విచారణ కోసం తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. ఓ ప్రైవేటు వాహనంలో ఖైదీలను తరలిస్తుండగా ట్రాఫిక్ జామ్ అయిన సమయంలో రెప్పపాటు వ్యవధిలో సదరు నిందితుడు తప్పించుకోవడం గమనార్హం. చంచలగూడ జైలు సమీపంలోనే వాహనం నుంచి దూకి పరారైనట్టు సమాచారం. పరారైన నిందితుడుని నరేశ్‌గా గుర్తించారు. ఈ నెల 12న ఈ ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Read Also: భర్తపై కోపం.. కోట్లు వెదజల్లిన మహిళ, వైరల్ వీడియో.. !
Follow Us On : WhatsApp

