Mobile Popup Ad
Mobile Popup Ad

అదిరిపోయే కవిత చెప్పిన కేసీఆర్

కలం, వెబ్ డెస్క్: జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే అరణ్యమై నిన్ను భయపెడుతుంది.. గుండె ధైర్యం ఉంటే నీ వెంటే అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది’ అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి గుండె ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. జీవన్ రెడ్డి గురించి తాను చెబితే.. తమకు తాము డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుందన్నారు. దాదాపు 40 ఏళ్లుగా స్నేహం ఉందని.. భిన్న రాజకీయ సిద్ధాంతాల వలన వేర్వేరు పార్టీలో పని చేరినట్లు తెలిపారు.

జీవన్ రెడ్డి (Jeevan Reddy) చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడిన కేసీఆర్ (KCR)… మాది మేము చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుందని ఛలోక్తులు విసిరారు. కాగా, కేసీఆర్ ప్రసంగం మొదలుపెట్టగానే భారీగా చేరుకున్న అభిమానులు జోష్ తో ఈలలు, కేకలు వేసి సందడి చేశారు. సభా ప్రాంగణమంతా సీఎం, సీఎం అనే నినాదాలతో మార్మోగిపోయింది. దీంతో ఎప్పటిలానే కేసీఆర్ తన స్టైల్లో వారిని నిదానపరిచారు.

Read Also: తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>