కలం డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) ప్రైజ్ మనీని భారీగా పెంచేశారు నిర్వాహకులు. కప్ గెలిచిన వారికి ఈసారి 50 మిలియన్ డాలర్లు అందించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ. ఈ టోర్నీ 2026లో అమెరికా, మెక్సికో, కెనడాల్లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు ఫిఫా రికార్డు స్థాయి ఆర్థిక సహకారం అందించనుంది.
ఈ ప్రపంచకప్‌కు సంబంధించిన మొత్తం ప్రైజ్‌మనీ ఫండ్ 655 మిలియన్ డాలర్లుగా (సుమారు 558.5 మిలియన్ యూరోలు) నిర్ణయించబడింది. ఇది 2022లో ఖతార్‌లో జరిగిన ప్రపంచకప్‌లో జట్లకు అందించిన ప్రైజ్‌మనీతో పోలిస్తే దాదాపు 50 శాతం ఎక్కువఅని ఫీఫా పేర్కొంది.
FIFA World Cup 2026 స్పెషాలిటీ ఇదే..
2026లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో తొలిసారి 48 జట్లు పోటీపడనున్నాయి. 2022లో జరిగిన వరల్డ్ కప్‌లో 32 జట్లు పాల్గొన్నాయి. దాంతో పోలిస్తే ఈ ఏడాది జట్ల సంఖ్య కూడా దాదాపు 50శాతం పెరిగింది. 2026 టోర్నమెంట్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది.
Read Also: KKR ముస్తాఫిజుర్ బిడ్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram


