Mobile Popup Ad
Mobile Popup Ad

రియల్ మాడ్రిడ్‌లో ముదురుతున్న విభేదాలు

కలం, వెబ్ డెస్క్: స్పానిష్ దిగ్గజం రియల్ మాడ్రిడ్ (Real Madrid)  క్లబ్‌లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జట్టులోని సీనియర్ ప్లేయర్ ఆంటోనియో రుడిగర్‌తో గొడవ జరిగిందన్న వార్తలపై డిఫెండర్ అల్వారో కర్రెరాస్ స్పందించారు. ఈ సీజన్ ముగింపులో మరో కీలక మ్యాచ్ ‘ఎల్ క్లాసికో’ జరగనున్న నేపథ్యంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు బయటపడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను అల్వారో కర్రెరాస్ ఖండించారు. తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రుడిగర్‌తో చిన్నపాటి గొడవ జరిగిన మాట వాస్తవమేనని, అయితే అది అప్పటికప్పుడే ముగిసిపోయిందని తెలిపారు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లందరితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి రియల్ మాడ్రిడ్‌కు ఆడాలన్నది తన కల అని, ఆ కల కోసమే ఎంతో కష్టపడి తిరిగి ఇక్కడికి వచ్చానని ఆయన గుర్తుచేశారు. మొదటి రోజు నుంచి తాను ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నానని, తనపై వస్తున్న వదంతుల్లో నిజం లేదని వివరించారు.

మరోవైపు, రియల్ మాడ్రిడ్ (Real Madrid) కోచ్ అల్వారో అర్బెలోవాతో ఆటగాళ్లకు పొసగడం లేదని వార్తలు వస్తున్నాయి. సుమారు ఆరుగురు ఆటగాళ్లు కోచ్‌తో మాట్లాడటం మానేశారని సమాచారం. గతంలో కోచ్‌గా ఉన్న జాబీ అలోన్సో హయాంలో కర్రెరాస్ కీలక ఆటగాడిగా ఉండేవారు. కానీ, అర్బెలోవా బాధ్యతలు చేపట్టాక కర్రెరాస్‌కు ఆడే అవకాశం తగ్గింది. కేవలం కర్రెరాస్ మాత్రమే కాదు.. కార్వజాల్, సెబల్లోస్ వంటి స్పానిష్ ఆటగాళ్ల పాత్ర కూడా జట్టులో తగ్గిపోయిందని తెలుస్తోంది. బెన్ఫికా నుంచి ఈ ఏడాది క్లబ్‌లో చేరిన 23 ఏళ్ల కర్రెరాస్, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 38 మ్యాచ్‌లు ఆడి రెండు గోల్స్ చేశారు. కానీ, గత ఆరు మ్యాచ్‌లలో మూడు సార్లు ఆయన బెంచ్‌కే పరిమితమయ్యారు. ఈ సీజన్‌లో రియల్ మాడ్రిడ్ ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోవడంతో కోచ్ అర్బెలోవాపై ఒత్తిడి పెరుగుతోంది. ఆయన స్థానంలో జోస్ మౌరిన్హో వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>