సిమ్ కార్డు జారీకి కొత్త రూల్స్

కలం, వెబ్‌డెస్క్: సిమ్ కార్డు జారీకి కొత్త నిబంధనలు (SIM Card Rules) అమల్లోకి రానున్నాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం అమల్లోకి రానుండటంతో టెలికాం రంగంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు యువత ఇకపై సిమ్ కార్డు పొందాలంటే తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా అనుమతి (verifiable consent) తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి స్పష్టమైన లిఖిత పూర్వకమైన అనుమతి తీసుకున్నాక కొత్త సిమ్ కార్డు తీసుకొనే అవకాశం ఉంటుంది.

టెలికాం కంపెనీలకు సూచనలు

ఈ మార్పులకు సంబంధించి టెలికమ్యూనికేషన్స్‌శాఖ ఇప్పటికే టెలికాం కంపెనీలకు సూచనలు జారీ
చేసింది. కొత్త చట్టం అమలు కోసం అవసరమైన సాంకేతిక, పరిపాలనా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. డిజిటల్ యుగంలో పిల్లల డేటా రక్షణను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. సైబర్ మోసాలు, డేటా దుర్వినియోగం వంటి ప్రమాదాలను తగ్గించేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే, సిమ్ కార్డు తీసుకునే ప్రక్రియలో కఠినమైన ధృవీకరణ విధానం తప్పనిసరి కానుంది. దీంతో మైనర్ల డిజిటల్ భద్రతపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>