కలం వెబ్ డెస్క్ : ఇటీవల ఐసీసీ మహిళల వరల్డ్ కప్(women world cup) ట్రోఫీ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు(Womens Cricket Team) సభ్యులు న్యూ ఇయర్ సందర్భంగా గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని(Ujjain) మహాకాళేశ్వర్(Mahakaleshwar) జ్యోతిర్లింగ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భస్మ హారతికి హాజరై ప్రార్థనలో పాల్గొన్నారు. టీం సభ్యులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టిస్తూ మొదటిసారి వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త సంవత్సరాన్ని ఆధ్యాత్మికంగా ప్రారంభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీం అద్భుత ప్రదర్శనతో ట్రోఫీ సాధించింది. భస్మ హారతిలో పాల్గొన్న క్రికెటర్లు, బాబా మహాకాళేశ్వర్‌ను దర్శించుకొని తిరుగుప్రయాణమయ్యారు.
Read Also: హ్యాంగోవర్‌తోనే మెలకువ వచ్చేస్తోంది.. న్యూ ఇయర్‌పై వర్మ వరుస ట్వీట్లు
Follow Us On: Youtube


