Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో ఈగిల్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠాను పట్టుకునేందుకు ఈగిల్ పోలీసులు టూ టౌన్ సిబ్బందితో కలిసి స్పెషల్ ఆపరేషన్ చేశారు. ఏసీపీ రమణమూర్తి ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఖమ్మం బైపాస్ రోడ్డులోని తిరుమల రోలింగ్ షట్టర్ ఇంజనీరింగ్ వర్క్స్ వద్ద పోలీసులు నిఘా పెట్టారు.

ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన రెండు కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్ల డిక్కీలు, డ్యాష్‌బోర్డుల్లో ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరల్లో 53 బ్రౌన్ టేప్ గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. దీని పరిమాణం 113.025 కిలోలుగా, విలువ సుమారు రూ.56 లక్షలుగా ఉంటుందని సీఐ బాలకృష్ణ తెలిపారు.

ఏపీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు..

కారులో ఉన్న నలుగురిని మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన రవి జాదవ్, గోపీనాథ్ సుక్లే, సంతోష్ థాయప్ప, మోహన్ భీకాజీ జాదవ్‌గా గుర్తించారు. వీరు ఏపీలోని అల్లూరి జిల్లాకు చెందిన బసు అలియాస్ వాసు వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసినట్లు తేలింది. అద్దె కార్లలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు.

నిందితుల నుంచి గంజాయితో పాటు రెండు కార్లు, నాలుగు ఫోన్లు, రూ.850 నగదు స్వాధీనం చేసుకున్నారు. సప్లయర్ బసు, కారు యజమాని బావూసాహెబ్ యాదవ్ పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. గంజాయి ముఠాను చాకచక్యంగా ముఠాను పట్టుకున్న టు టౌన్ సీఐ బాలకృష్ణ, ఈగిల్ టీమ్ సీఐ విజయ్, ఎస్ఐ రమేష్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>