కలం, వెబ్ డెస్క్ : మాస్ మహారాజ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ (BMW Trailer) ను తాజాగా రిలీజ్ చేశారు. ‘వరుసగా మాస్ ఫైట్లు చేసి అలసిపోయా.. అందుకే కాస్త గ్యాప్ ఇవ్వమని మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు’ అనే డైలాగ్ తో రవితేజ ఎంట్రీ మొదలైంది. అంటే ఇప్పటి వరకు అన్నీ మాస్ సినిమాలే చేశాడు కాబట్టి ఈ సారి ఫ్యామిలీ డ్రామా మూవీతో వస్తున్నట్టు చెబుతున్నాడు రవితేజ. రవితేజ భార్యగా డింపుల్ హయతీ ఉండగా.. ప్రియురాలిగా అషీకా రంగనాథ్ ను చూపించారు. భార్య ఉండగానే అషీకాతో రవితేజ కనెక్ట్ అవుతాడని ట్రైలర్ లో చూపించారు.
మధ్యలో కొంచెం మాస్ ఫైట్లు, రెండు ఎలివేషన్లు కూడా పెట్టేశాడు కిషోర్ తిరుమల. భార్యతో విసిగిన భర్త మరో అమ్మాయికి దగ్గరైతే చివరకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే కోణంలో కథ ఉండబోతున్నట్టు ట్రైలర్ (BMW Trailer) చూస్తే అర్థం అవుతోంది. కాకపోతే కొంచెం కామెడీని యాడ్ చేశారు. కమెడియన్ సత్య ఇందులో అషీకా దగ్గర పనిచేసే వాడిగా కనిపిస్తున్నాడు. అతని కామెడీ కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. సునీల్ ఇందులో రవితేజ బావమరిది పాత్రలో కనిపిస్తున్నాడు. ‘పెళ్లికి ముందు మా బావ ఎలా ఉండేవాడో తెలుసా’ అంటూ రవితేజకు ఎలివేషన్ ఇస్తున్నాడు. కాకపోతే ఇందులో విలన్లు పెద్దగా లేనట్టే కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే ఈ మూవీ ఉండబోతోంది. ట్రైలర్ చూస్తే కామెడీనే హైలెట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.


