కలం, జనగామ: భక్తికి, స్నేహానికి కులమతాల అడ్డుగోడలు లేవని జనగామ (Jangaon) లో జరిగిన ఒక ఘటన మరోసారి నిరూపించింది. శ్రీరామ నవమి (Sri Rama Navami) పర్వదినాన్ని పురస్కరించుకుని TNGO యూనియన్ జనగామ ప్రతినిధి, ఆత్మీయ మిత్రుడు ఖాజా షరీఫ్ అందించిన శ్రీ సీతారామ-లక్ష్మణ విగ్రహం ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది.
ఈ సందర్భంగా ఖాజా షరీఫ్ తన మిత్రుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధ్యక్షుడు బింగి సురేష్‌కి ఈ పవిత్ర విగ్రహాన్ని కానుకగా అందించారు. సదరు మిత్రుడు ఎంతో భక్తితో ఆ విగ్రహాన్ని స్వీకరించి, ఇంట్లో శాస్త్రోక్త పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో గంగా-జమునా తెహజీబ్ (సహజీవనం)కు ఇది ఒక చక్కని నిదర్శనంగా నిలిచింది. పండుగ పూట ఒక ముస్లిం సోదరుడు రాముడి విగ్రహాన్ని కానుకగా ఇవ్వడం, దానిని హిందూ సోదరుడు భక్తితో పూజించడం ద్వారా సమాజంలో మత సామరస్య సందేశాన్ని చాటిచెప్పారు. ఈ విశేషం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమై అందరినీ ఆకట్టుకుంటోంది.
Read Also: సౌత్ వర్సెస్ నార్త్.. ‘ఢీ’ లిమిటేషన్
Follow Us On: Facebook

