వికెట్లు తీయకపోయినా బుమ్రానే కీలకం: అశ్విన్

క‌లం, వెబ్ డెస్క్‌: టీమిండియా స్టార్ స్పిన్నర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌ (IPL)లో ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయకపోవడమే ఈ విమర్శలకు కారణం. బుమ్రా తన ఎడ్జ్‌ను కోల్పోయాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో బుమ్రాకు టీమిండియా మాజీ పేసర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మద్దుతుగా నిలిచాడు. బుమ్రా వికెట్లు తీయకపోయినా, అతని ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని సీనియర్ స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అయితే, ఈ గణంకాల కంటే జట్టు కోసం అతను చేస్తున్న పోరాటం ఎంతో విలువైనదని అశ్విన్ కొనియాడారు. ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 240 పరుగుల భారీ స్కోరు సాధించగా, ముంబై దాన్ని ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్‌లోనూ బుమ్రాకు వికెట్లు దక్కలేదు. కానీ, ఇతర బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తుంటే, బుమ్రా మాత్రం 8.53 ఎకానమీతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు.

దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన అశ్విన్ (Ashwin).. వికెట్ల కంటే పరుగులను నియంత్రించడమే కీలకమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చిన్న సరిహద్దులు ఉండే వాంఖడే వంటి స్టేడియాల్లో యార్కర్లు వేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వికెట్లు తీయలేదనే విమర్శలు జట్టు ప్రయోజనాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఈ సీజన్‌లో ముంబై బౌలింగ్ యూనిట్ అత్యంత పేలవంగా ఉందని అశ్విన్ గుర్తుచేశారు. నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు కేవలం 14 వికెట్లు మాత్రమే తీసి, 11.19 ఎకానమీతో పరుగులు ఇచ్చుకుంది. వికెట్లు తీయడం అనేది కేవలం ఒక్కరి బాధ్యత కాదని, అది బౌలర్లందరూ సమష్టిగా చేయాల్సిన పని అని ఆయన వివరించారు. భాగస్వామ్యంతో బౌలింగ్ చేయడం గురించి గతంలో మలింగ చెప్పిన మాటలను అశ్విన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Read Also: అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పై రామ్ చరణ్.. స్టైలిష్ లుక్స్ అదుర్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>