కలం, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ‘ఇరుముడి’ సినిమాకు వస్తున్న స్పందన రవితేజ మార్కెట్‌పై పాజిటివ్ ప్రభావం చూపిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచి సుమారు రూ.40 కోట్లకు తీసుకెళ్లినట్లు టాలీవుడ్లో ప్రచారం సాగుతుందట.
అయితే, ప్రస్తుతం రవితేజకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పారితోషికాన్ని నిర్మాతలు ఎంతవరకు ఒకే చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ‘ఇరుముడి’ ఇచ్చిన ఊపుతో ఇకపై రవితేజ నటించే ప్రతి సినిమా కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుందా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

