రుషికొండ ప్యాలెస్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో భూ వివాదాలు, కబ్జాలతో చెలరేగిపోయారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) విమర్శించారు. రూ.వందల కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ నిర్వహణ భారంగా మారిపోయిందన్నారు. దీనిపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖను రాజధాని చేస్తామని.. నేరాలకు రాజధాని చేశారని మండిపడ్డారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో శాంతి లేకుండా చేశారని గుర్తు చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అనే సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మెగా డీఎస్సీలో కుంభకోణం జరిగిందంటూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని.. అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా డీఎస్సీ నిర్వహించామన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>