ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి: తిరుపతి, నూతన్‌

కలం, నిర్మల్‌: పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించాలని, గ్రామాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) జిల్లా అధ్యక్షుడు డాకూర్‌ తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 6న హైదరాబాద్‌లోని సీఆర్‌డీ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.800 వేతనం చెల్లించాలని, పథకం నిర్వహణకు రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో పనులు ప్రారంభించడంతో పాటు పట్టణ ప్రాంతాలకూ ఉపాధి హామీని విస్తరించాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సుంచుల నారాయణ, బరుకుంట గంగారాం పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>