ఐపీఎల్‌లో పాండ్యాకు తప్పని నిరాశ.. కెప్టెన్సీ ఇక కష్టమే!

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2027 సీజన్ ముందు కొత్త ఫ్రాంచైజీ బాట పట్టనున్న భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) మరోసారి నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశం కనిపించడం లేదు. ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు ఆయన మారేందుకు చర్చలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, అక్కడ ఆయన కేవలం ఆటగాడిగానే కొనసాగాల్సి వస్తుందని సమాచారం. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబైకి పంపి, హార్దిక్‌ను పంజాబ్ తీసుకునేందుకు ఇరు ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయని మంగళవారం నాటి పీటీఐ నివేదికలు స్పష్టం చేశాయి. ముంబై ఇండియన్స్‌కు మూడేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్, జట్టును ఆశించిన స్థాయిలో నడిపించలేకపోయారు.

రోహిత్ శర్మ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటికీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైంది. 2027 సీజన్‌లో ముంబై నాయకత్వాన్ని తిరిగి రోహిత్ శర్మ చేపడతారని ప్రచారం సాగుతుండటంతో హార్దిక్ నిష్క్రమణకు మార్గం సుగమమైంది. అయితే పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా సఫలమవడంతో, హార్దిక్ వస్తే కేవలం ఆటగాడిగానే ఉంటాడనే విషయాన్ని పంజాబ్ ముందే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్‌గా జట్టును బలోపేతం చేసేందుకే పంజాబ్ ఆయనను తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>