కలం, నిర్మల్ : రానున్న వేసవిలో నిర్మల్ పట్టణ ప్రజలకు తాగునీటి (Nirmal Drinking Water) ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. పట్టణానికి నీరు సరఫరా చేసే శ్రీరామ్ సాగర్ జలాశయాన్ని మంగళవారం మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. ప్రస్తుతం వేసవికి సరిపడా నీరు అందుబాటులో ఉందని, అనుకోని పరిస్థితులు ఎదురైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, పైపులైన్లలో లీకేజీలు గుర్తిస్తే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈ హరిభువన్, కౌన్సిలర్లు గోపు గోపి, పెండం శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, శెనిగారపు నరేష్, నాయకులు నాందేడపు చిన్ను, రఫీ, నరేష్, జాకీ, అనిల్ పాల్గొన్నారు.

