Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమకొండలో రాస్తారోకో.. బండి సంజయ్‌పై సీపీఐ విమర్శలు

కలం, వరంగల్ బ్యూరో: పోక్సో కేసులో తన కొడుకును రక్షించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ (Hanumakonda) కాళోజీ సెంటర్‌లో సీపీఐ (CPI) హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) ఇటీవల 17 ఏళ్ల మైనర్ బాలికను మద్యం తాగించి, కొన్నిసార్లు డ్రగ్స్ ఇచ్చి మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు పెట్టినట్లు తెలిపారు. బండి సంజయ్ తన కుమారుడిని రక్షించుకునేందుకు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి భగీరథ్‌ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తండ్రి హోం సహాయ మంత్రిగా ఉండడం వలన పోలీసు యంత్రాంగాన్ని, ప్రధాన మీడియాను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తే కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, బి.విజయసారధి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, ఎన్‌ఎ స్టాలిన్, ఎదునూరి వెంకట్రాజం, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, మాలోత్ శంకర్ నాయక్, కండె నర్సయ్య, గుంటీ రాజేందర్, అలువాల రాజు తదితర వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: స్టార్ట్ అయిన ‘సర్’.. ఎవరి ఓటుకు వారే కాపలా!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>