కలం, వెబ్ డెస్క్ : నెల్లూరు రూరల్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy) వినూత్నంగా ఎలక్ట్రిక్ బైక్‌పై పర్యటిస్తూ ఇంధన పొదుపు సందేశాన్ని ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గంలో తాను కూడా పొదుపు విధానాలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే తన కాన్వాయ్, ఎస్కార్ట్‌ను రద్దు చేసి సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్‌పై నియోజకవర్గ పర్యటన చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా నెల్లూరు రూరల్‌లో రూ.17 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 168 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. స్థానిక ప్రజల సమక్షంలోనే శంకుస్థాపనలు నిర్వహించడం ద్వారా పారదర్శకతను చూపించామని ఆయన (MLA Kotamreddy) పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గురజాల గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.700 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిని 60 రోజులలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల చేతుల మీదుగానే ప్రారంభోత్సవాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇంధన పొదుపు, అభివృద్ధి కార్యక్రమాలను అందరూ పాటించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: సైకిల్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే హల్‌చల్.. వీడియో వైరల్
Follow Us On: Instagram

