కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం.. పువ్వాడ అజయ్ కుమార్

కలం, ఖమ్మం బ్యూరో: ‘రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశాం. ప్రతిపక్షంలో ప్రజల తరపున పోరాటాలు చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడతాం’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు. గతంలో మన మధ్య బేధాభిప్రాయాలు ఉన్నా, వాటన్నింటినీ ఇక్కడితో మర్చిపోదామని, మళ్లీ కేసీఆర్‌ను (KCR) ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమన్నారు. ఆ లక్ష్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన కార్యకర్తలకు ​పిలుపునిచ్చారు.

అలాగే ​ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో పార్టీ పునర్నిర్మాణం కోసం ఓ సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని, ప్రతి గడపకూ పార్టీని తీసుకెళ్తానని పువ్వాడ (Puvvada Ajay Kumar) పేర్కొన్నారు. పార్టీ ​సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని సూచించారు. అనంతరం ​బీఆర్ఎస్ సభ్యత్వ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ రావుకు పువ్వాడ సన్మానం చేశారు. అలాగే జిల్లాలో పార్టీ పరిస్థితి, సభ్యత్వ నమోదుపై కీలక చర్చలు జరిపారు. ​ఈ సమావేశంలో బీఆర్ఎస్ (BRS) జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: విజయ్‌లా నేనూ అధికారంలోకి వస్తా : కవిత

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>