హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఏడు జోన్లలో ‘రన్ ఫర్ యూనిటీ(Run for Unity)’ని ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివాస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్‌లు శుక్రవారం ఉదయం ‘రన్ ఫర్ యూనిటీ’ ని ఘనంగా నిర్వహించారు.
ఈ రన్(Run for Unity) ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్‌తో పాటు ఏడు జోన్లలో జరిగింది. ఇందులో డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా పాల్గొన్నారు. ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరు మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత నేటి తరానికి ఆదర్శనీయం అని అన్నారు. 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసి, ‘వన్ నేషన్’ ని మనకు అందించిన గొప్ప వరం సర్దార్ పటేల్ అని తెలిపారు. ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ అనే పటేల్ సందేశాన్ని పోలీసులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయం. మరియు ‘డీప్ ఫేక్(Deepfake)’ అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని, ఈ సమస్యను డీజీపీ మరియు హైదరాబాద్ సీపీ సజ్జనార్ గారు సీరియస్‌గా తీసుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని ధైర్యం చెప్పారు.
Read Also: మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం..

