epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రష్మిక-విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ జరిగేది అక్కడే!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ హిట్ ఫెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Vijay) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఊహించిన దానికంటే త్వరగా మిస్టర్ అండ్ మిసెస్‌గా మారుతున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ జంట ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఈ జంట 2026లో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో వారి వివాహం జరగనుందని విజయ్-రష్మిక సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘ వెడ్డింగ్  కోసం హెరిటేజ్ ప్లేస్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. నిశ్చితార్థం లాగే పెళ్లికి కూడా సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే అటెండ్ అవుతారు’ అని తెలిపాయి. అయితే హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఈ జంట రిసెప్షన్ నిర్వహిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. దసరా తర్వాత అక్టోబర్ 3, 2025న హైదరాబాద్‌లో విజయ్, రష్మిక ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, విజయ్ బృందం తరువాత నిశ్చితార్థాన్ని ధృవీకరించింది.

పెళ్లి వార్తలపై ఈ జంట మౌనంగా ఉన్నప్పటికీ, ది గర్ల్‌ఫ్రెండ్ (The Girl Friend) కోసం జరిగిన ఓ ఈవెంట్‌లో విజయ్ రష్మికపై (Rashmika Vijay) చూపిన ప్రేమను అందరినీ ఆకర్షించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మొదట 2018లో బ్లాక్ బస్టర్ మూవీ ‘గీత గోవిందం’లో కలిసి నటించారు. తర్వాత డియర్ కామ్రేడ్ (2019)లో కూడా జతకట్టారు.

Read Also: ‘సఃకుటుంబానాం’ జనవరి 1న రిలీజ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>