సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, మహిళలపై అభ్యంతర కరంగా వీడియోలు, పోస్టులు చేస్తున్న వారు ఈ మధ్య ఎక్కువయ్యారు. ఏఐను యూజ్ చేసుకుని ఫేక్ డీప్ వీడియోలు, అశ్లీలంగా సెలబ్రిటీల ఫొటోలను ఎడిట్ చేసి వైరల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వీటిపై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా రష్మిక(Rashmika) ఫైర్ అయింది. రష్మిక కూడా అప్పట్లో డీప్ ఫేక్ వీడియో బాధితురాలే అని మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, మహిళలపై అనుచితంగా పోస్టులు క్రియేట్ చేసేవారు మనుషుల్లా ప్రవర్తించరని మండిపడింది రష్మిక.
అలాంటి వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరింది రష్మిక (Rashmika). ఏఐ అనేది మన అభివృద్ధికి ఉపయోగించాలి. అంతేగానీ అవతలివారిని కించపరిచేందుకు కాదు. టెక్నాలజీ మన లైఫ్ ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలా వాడుకోవాలి. సోషల్ మీడియా అనేది నైతికకు అద్దంలా ఉండాలి. కానీ చాలా మందిలో నైతికత లేకుండా పోతోంది. అందుకే ఏది పడితే అది పెట్టేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని రష్మిక మండిపడింది.
Read Also: సంచలన కేసులో టాలీవుడ్ సినీ పెద్దలు!!
Follow Us On: X(Twitter)


