సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi App) పై కేంద్రం ఒకడుగు వెనక్కి తగ్గింది. మొబైల్ తయారీ కంపెనీలు ప్రి-ఇన్ స్టాలేషన్ గా సంచార్ సాథీ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ లో అందించడం తప్పనిసరి కాదని చెప్పింది. ఈ మేరకు బుధవారం లోక్ సభలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార్ సాథీ యాప్ ద్వారా స్నూపింగ్ చేయడం అసాధ్యం అని చెప్పారు.
కాగా, సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi App) ను ఇన్ బిల్ట్ గా ప్రతి స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా అందిచాలని మొబైల్ తయారీ కంపెనీలకు తొలుత కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు సంచార్ సాథీ యాప్ పనిచేయాలంటే వినియోగదారుడు కచ్చితంగా తమ కాల్స్, మెస్సేజ్ లు, ఫొటోలపై అనుమతి ఇవ్వాల్సిందే అని పేర్కొంది. దీనిపై ప్రతిపక్షాలు, మొబైల్ తయారీ కంపెనీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాజ్యాంగం ప్రసాదించిన గోప్యత హక్కును భంగపరిచేలా, ప్రజలపై నిఘా పెట్టేలా ఈ సంచార్ సాథీ యాప్ ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సర్దుబాటుకు దిగిన కేంద్ర ప్రభుత్వం వినియోగదారుడు వద్దనుకుంటే ఈ యాప్ ను డిలీట్ చేసుకోవచ్చని చెప్పింది. ఇక, ఈ రోజు ప్రి-ఇన్ స్టాలేషన్ తప్పనిసరి కాదని లోక్ సభలో వెల్లడించింది.
Read Also: వాళ్లు మనుషులే కాదు.. గళమెత్తిన రష్మిక
Follow Us on: Facebook


