ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పై జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అయితే ఆ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రాణి కౌముదినికి ఆమె నేరుగా ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లోలేని ప్రాంతాల్లో సీఎం సభలు నిర్వహిస్తున్నప్పటికీ అక్కడికి ఎన్నికల జరుగుతున్న గ్రామీణ ప్రాంతాల ఓటర్లను తరలిస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఇటువంటి ప్రచారాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో ప్రస్తావించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని పేర్కొన్నారు. మక్తల్, కొత్తగూడెం సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలకు సంబంధించిన క్లిప్పులను కూడా ఆమె ఫిర్యాదుతోపాటు జత చేశారు.
ఈసీ స్పందన ఏమిటి?
అయితే మరి కవిత (Kavitha) ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. స్థానిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలు జరగడం సహజమే. గతంలోనూ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించిన ప్రచారం చేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎంతో జాగ్రత్తగా ఎన్నికల కోడ్ అమల్లోలేని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. సాంకేతికంగా చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందా? అన్నది వేచి చూడాలి. ఈ సభల్లో ముఖ్యమంత్రి నేరుగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని ఎక్కడా పిలుపునివ్వలేదు. మంచిచేసేవాళ్లను ఎన్నుకోండి అన్నారు తప్ప.. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి అని అనలేదు. కాబట్టి మరి చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
Read Also: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్
Follow Us On: WhatsApp


