Mobile Popup Ad
Mobile Popup Ad

గద్దర్ అవార్డుపై రష్మిక ఎమోషనల్ ట్వీట్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు (Gaddar Film Award) అందుకోవడంపై నటి రష్మిక మందన్న సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. చిన్నతనంలో ఎవరైనా రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిస్తే వారిని సూపర్‌స్టార్స్‌లా భావించేదాన్నని గుర్తు చేసుకున్నారు. వారు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారు? వారు ఏం చేస్తారు? అనే విషయాలపై తనకు ఎంతో ఆసక్తి ఉండేదన్నారు. ఇప్పుడు అదే స్థాయిలో పురస్కారాన్ని అందుకోవడం ప్రత్యేకంగా అనిపిస్తోందని రష్మిక (Rashmika Mandanna) పేర్కొన్నారు.

నిన్న సాయంత్రం జరిగిన వేడుకలో ఈ అవార్డు తీసుకోవడం తనకెంతో గర్వకారణంగా ఉందని, తన సినీ ప్రయాణంలో ఎంతో దూరం వచ్చాననే భావన కలుగుతోందన్నారు. తెలంగాణలో రాష్ట్ర పురస్కారం అందుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. తన మనసులోని భావాలను మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉన్నానని ఆమె వెల్లడించారు.

Read Also: వార్ ఎఫెక్ట్.. భారత రూపాయి విలువ ఢమాల్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>