కలం, వెబ్ డెస్క్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి తెలంగాణలో ఏ సినిమాకూ టికెట్ రేట్లు పెంచడం ఉండదంటున్నాడు. మా వద్దకు రాకండి, మేం పెంచం అని చెప్పాడు. దీంతో సంక్రాంతికి రాబోతున్న సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడబోతోందని తెలుస్తోంది. బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 టికెట్ రేట్ల పెంపు జీవోను నిన్న సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నేడు డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇక నుంచి ఏ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచబోమని.. దయచేసి తమ దగ్గరకు హీరోలు, నిర్మాతలు రావొద్దని కోరుతున్నాడు. ఈ సారి పొరపాటు జరిగింది.. ఇంకోసారి ఇలా జరగనివ్వం అని తేల్చి చెప్పేశారు.
మంత్రి(Minister Komatireddy) ప్రకటనతో రాబోయే సంక్రాంతికి వస్తున్న చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు హైక్స్ ఉండవేమో అంటున్నారు. చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు, ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీలు భారీ బడ్జెట్ తో వస్తున్నాయి. వీరిద్దరి గత సినిమాలకు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచారు. కానీ ఈ సారి రేట్లు పెంచడం ఉండదేమో అని ప్రచారం మొదలైంది. ఎందుకంటే గతంలో ఓజీ మూవీకి, ఇప్పుడు అఖండ 2కు ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసింది. మరోసారి అదే రిపీట్ అయితే మంచిది కాదని ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉన్నారంట. కాబట్టి చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోతే.. కలెక్షన్లు తగ్గే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సమ్మర్ కు వచ్చే సినిమా పరిస్థితి కూడా అంతే కాబోలు.
Read Also: జనాభా లెక్కల సేకరణకు రూ. 11,718 కోట్ల కేటాయింపు
Follow Us On: Pinterest


