కలం, వెబ్‌డెస్క్: Census 2027 | జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. జనాభా లెక్కల ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 11,718 కోట్లు కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ చాలా రోజులుగా పెండింగ్‌లో పడిపోయిన విషయం తెలిసిందే. ఫస్ట్‌ఫేజ్‌లో భాగంగా ఏప్రిల్, సెప్టెంబరు 2026 మధ్యలో ఇంటింటి సర్వే ప్రారంభం కానున్నది.
తొలుత ఇండ్ల లెక్కింపు
జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా తొలుత ఇండ్లను లెక్కించనున్నారు. ఇండ్లలోని సౌకర్యాలు (కరెంట్, గ్యాస్, ఇంటి స్వభావం) వివరాలు తెలుసుకోబోతున్నారు. ఏ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తే అప్పుడే గణన ప్రారంభం కానున్నది. కనీసం 30 రోజులపాటు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 2026 అక్టోబరు 1-5 తేదీల మధ్య వివరాల్లో ఏవైనా తేడాలు, సవరణలు చేయనున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వివరాలు సవరించనున్నారు.
రెండో దశలో..
Census 2027 | రెండో దశలో భాగంగా ఫిబ్రవరి 2027లో (హిమాలయ పర్వత ప్రాంతాల్లో) 2027 మార్చి 1-5 తేదీల మధ్య నిర్వహించనున్నారు. జనగణన, కులగణన మొత్తం డిజిటల్‌గా రికార్డు చేయబోతున్నారు.
మొత్తంగా 30 లక్షల మంది సిబ్బంది ఈ ప్రక్రియ కోసం వినియోగించనున్నారు.
Read Also: ‘టైమ్స్’ కవర్‌పేజీగా కృత్రిమ మేధ నిర్మాతలు
Follow Us On: X(Twitter)


