కలం, వెబ్ డెస్క్: నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) నటనకు విరామం ఇచ్చి కొంతకాలంగా నిర్మాణ రంగంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆయన నటించాల్సిన కొన్ని ప్రాజెక్టులు అనివార్య కారణాల వల్ల నిలిచిపోయాయి. అభిమానులు రానా వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఒక భారీ ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు సమాచారం. ‘హను-మాన్’ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం జై హనుమాన్‌లో (Jai Hanuman) కీలక పాత్ర పోషించనున్నారు.
రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రానా పాత్రను దర్శకుడు ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి షూటింగ్ షెడ్యూల్స్‌పై తుది చర్చలు జరుపుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. రానా (Rana Daggubati) ఈ ప్రాజెక్టులో చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Read Also: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ “డ్రాగన్” షూటింగ్‌కు బ్రేక్
Follow Us On : WhatsApp

