Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ “డ్రాగన్” షూటింగ్‌కు బ్రేక్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “డ్రాగన్” (Dragon) షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ నెలలో ప్రారంభించాల్సిన కీలక షెడ్యూల్ అనూహ్యంగా నిలిపివేసినట్లు సినీ వర్గాల సమాచారం.

ఈ షెడ్యూల్‌లో హీరోని కొత్త లుక్‌‌లో  పరిచయం చేయాల్సి ఉండగా, ఆ లుక్‌పై దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఇద్దరూ సంతృప్తి చెందలేదని సమాచారం. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్న ఉద్దేశంతో షూట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. సినిమా నాణ్యత విషయంలో ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ముందుకు సాగుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం జోర్డాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అనంతరం శంషాబాద్ సమీపంలోని ఆలయం వద్ద కూడా వారం రోజులపాటు షూటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం నగర శివార్లలో భారీ సెట్ నిర్మాణం కొనసాగుతోంది. ఆ సెట్‌లో తదుపరి షెడ్యూల్‌ను వచ్చే నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొదటగా ఈ చిత్రాన్ని 2026 జూన్ 25న విడుదల చేయాలని మూవీ టీం ప్రకటించినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఆ తేదీకి డ్రాగన్ (Dragon) మూవీ రిలీజ్ కష్టమే అని తెలుస్తోంది. అయితే ఇదే తేదీకి రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది.

Read Also: రానా రీఎంట్రీ.. జై హనుమాన్‌‌తో బిజీబిజీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>