కేసీఆర్, రేవంత్‌రెడ్డిపై రామ్‌చందర్‌రావు తీవ్ర విమర్శలు

కలం, వెబ్ డెస్క్: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramchander Rao) ఘాటుగా స్పందించారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఒకరికొకరు కాళ్లు మొక్కుకుంటున్నారు కానీ.. తమకు ఎవరి కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాము ప్రజల కాళ్లు మొక్కుతామంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభలతో ఎలాంటి రాజకీయ ప్రభావం లేదని కొట్టిపారేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు.

కాళేశ్వరంపై (Kaleshwaram) విచారణ చేయట్లేదని కాంగ్రెస్ చెబుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై మాత్రమే విచారణకు ఆదేశించారని.. పూర్తి విచారణకు కాంగ్రెస్‌ ఎందుకు అదేశమివ్వలేదని ప్రశ్నించారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ కాపాడారని ఆరోపించారు. దానికి కృతజ్ఞతగా ఇప్పుడు కాళేశ్వరం కేసులో కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని రామచందర్‌రావు (Ramchander Rao) ఆరోపించారు.

Read Also: బీఆర్ఎస్ ఉట్టి కథలు.. కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పింది: కవిత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>