కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) జిల్లా పెద్ద కొడప్ గల్ (Pedda Kodapgal) మండల కేంద్రంలో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. రబీ సీజన్‌లో పండించిన జొన్నలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న వెంటనే తహసీల్దార్ రాజశేఖర్ ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.
జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చిన అనంతరం రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు. అయితే సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు.
Read Also: కేసీఆర్ నాలుకకు రంధ్రాలు ఉంటే బాగుండు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Follow Us On: Instagram

