కలం, వెబ్ డెస్క్: గులాబీ బాస్ కేసీఆర్ జగిత్యాల సభ, సీఎం రేవంత్ భూపాలపల్లి సభపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ సభ పెట్టి ఉట్టి కథలు, కాంగ్రెస్ సభ పెట్టి పిట్ట కథలు చెప్పిందే తప్ప.. ప్రజల కష్టాలు గురించి ఎవరూ చెప్పలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజలనే తప్పుబడుతున్నారని.. తమను ఓడించి తప్పు చేశారని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పారు. వెయ్యి ఏళ్లయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మారవని అన్నారు.
ఉద్యమకారుల గురించి పట్టించుకోకుండా కేవలం స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీ పని చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌లో ఆడబిడ్డలకు గౌరవం ఉండదని కవిత (Kavitha) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి (Jeevan Reddy) పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని ఫైర్ అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. 75 ఏళ్లు వచ్చిన వ్యక్తి యువకుడైతే.. రాష్ట్రంలోని యువకులందరూ ఏమవ్వాలి. వాళ్లందరూ చచ్చిపోయారా? అని ఫైర్ అయ్యారు. తాము పెట్టబోయే పార్టీలో యువతకు మంచి అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ వస్తున్న కారణంగా పబ్లిసిటీ మెటీరియల్‌కు ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా జీహెచ్ఎంసీ అధికారులు సహకరించాలని కవిత విజ్ఞప్తి చేశారు.
Read Also: కేసీఆర్ నాలుకకు రంధ్రాలు ఉంటే బాగుండు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Follow Us On: Instagram

