లాడ్జిలో గది అద్దెకు తీసుకుని.. చివరకు!

కలం, కరీంనగర్ బ్యూరో: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సైదాపూర్ మండలం, వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగురి అరుణ్ కుమార్ (28) అనే యువకుడు కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను ఈ నెల 19న జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. కొంత సమయం తర్వాత గదిని శుభ్రం చేయడానికి సిబ్బంది వెళ్లారు. ఎన్నిసార్లు పిలిచినా లోపల నుండి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది లాడ్జీ యజమానికి సమాచారం అందించారు. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు గదిలో అరుణ్ కుమార్ ఉరేసుకుని మృతి చెంది ఉండటం గమనించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>