Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం : కేటీఆర్

కలం, మెదక్ బ్యూరో : సివిల్ సప్లై కార్పోరేషన్ లో భారీ కుంభకోణం జరిగిందని, అందుకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (MLA Chinta Prabhakar) తో కలిసి సదాశివపేటలో శనగ కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుని చచ్చేవరకు వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదాశివపేటలో శనగ పంట తెచ్చి నెల రోజులైనా ఇప్పటివరకు పంట కొనుగోలు చేయలేదన్నారు. ధాన్యం కోనుగోలు చేయొద్దనేది ఈ ప్రభుత్వం ఆలోచనలా ఉందని ఆరోపించారు.

95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా.. కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారని తెలిపారు. చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభించలేదన్నారు. ధాన్యం దళారుల పాలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంలా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పంట కూడా సరిగా కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో వడదెబ్బకి, పిడుగులు, హార్ట్ స్ట్రోక్ తో రైతులు చనిపోతుంటే పట్టింపే లేదని విమర్శించారు. వారం రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతులకు ధైర్యం చెబుతామని, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదిస్తామని కేటీఆర్ (KTR) హెచ్చరించారు.

Read Also: టీవీకే పార్టీకి మంత్రి లోకేశ్​ శుభాకాంక్షలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>