కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026(IPL 2026)లో నేడు మరో ఉత్కంఠభరిత పోరుకు సమయం ఆసన్నమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు (SRH VS KKR) తలపడనున్నాయి. తమ మొదటి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన ఈ రెండు జట్లు, నేటి మ్యాచ్‌తో గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉన్నాయి. కోల్‌కతా తన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 220 పరుగులు చేసినప్పటికీ, ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అటు సన్‌రైజర్స్ కూడా బెంగళూరు చేతిలో ఆరు వికెట్ల తేడాతోనే పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో తమ ఓటమికి ఈ రెండు జట్లలో ఏది ఫుల్ స్టాప్ పెడుతుందన్న చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో భారీగా స్కోర్ చేసే అవకాశం ఏయే ఆటగాళ్లకు ఉంది? వాళ్లు ఎవరు? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. దీంతో ఎక్కువగా డేంజర్ బ్యాటర్లుగా ముగ్గురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్. ఈ కివీస్ బ్యాటర్ ముంబైపై జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లోనే 17 బంతుల్లో 37 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇటీవల ఇదే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాపై అజేయ సెంచరీ బాదిన రికార్డు కూడా అతనికి ఉంది.
సన్‌రైజర్స్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్. ఇషాన్ గత మ్యాచ్‌లో బెంగళూరుపై 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ అత్యుత్తమంగా రాణించిన అతను, కేకేఆర్‌పై కూడా మంచి రికార్డు కలిగి ఉన్నాడు.
ట్రావిస్ హెడ్ మొదటి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, గత సీజన్‌లో కేకేఆర్‌పై 76 పరుగులు చేసిన చరిత్ర అతనికి ఉంది. గతంలోనూ కోల్‌కతాపై అజేయ అర్ధ సెంచరీతో రాణించిన హెడ్, నేటి మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. మొత్తానికి ఇరు జట్లలోని (SRH VS KKR) బ్యాటింగ్ దళం బలంగా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడానికి ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కీలకం. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Read Also: ‘రామాయణ’ టీజర్ రిలీజ్.. శ్రీరాముడి అవతార్‌లో రణబీర్
Follow Us On : WhatsApp

