Mobile Popup Ad
Mobile Popup Ad

ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి విషాదాంతం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్ వేదికగా చిగురించిన ప్రేమ, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కినా.. ఆ బంధం కేవలం 50 రోజులకే నూరేళ్లు నిండిపోయింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ (Hyderabad Software)గా పనిచేస్తున్న ఇషికా యాదవ్ (25) అదనపు కట్నం వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది.

బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మియాపూర్ పరిధిలో వీరిద్దరూ కాపురం పెట్టారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజుల నుంచే భర్త నీరజ్ అదనపు కట్నం కోసం ఇషికాను వేధించడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

భర్త వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇషికా, బుధవారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>